*తిరుమలలో*
*జెఈవో బి.లక్ష్మికాంతం*
*విస్తృత తనిఖీలు*
*టిటిడి తిరుమల ఇన్‌చార్జి జెఈవో*
*శ్రీ బి.లక్ష్మీకాంతం* *ఆదివారం తిరుమలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు*.
ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్,
ఆ తరువాత శ్రీవారి ఆలయం, సిఆర్వో, కల్యాణకట్ట ప్రాంతాలను *పరిశీలించారు*.
*తిరుమలలో*
*జెఈవో బి.లక్ష్మికాంతం*
*విస్తృత తనిఖీలు*
*టిటిడి తిరుమల ఇన్‌చార్జి జెఈవో*
*శ్రీ బి.లక్ష్మీకాంతం* *ఆదివారం తిరుమలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు*.
ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్,
ఆ తరువాత శ్రీవారి ఆలయం, సిఆర్వో, కల్యాణకట్ట ప్రాంతాలను *పరిశీలించారు*.
*అనంతరం సిఆర్వోలో జెఈవో మీడియాతో మాట్లాడుతూ*,
ఇక్కడ గదుల కోసం నమోదు చేసుకోవడం, కేటాయింపు విధానాలను *పరిశీలించామన్నారు*. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందించే విధానాన్ని చూశామని, ఎలాంటి అంతరాయం లేకుండా పంపిణీ చేయాలని *ఆధికారులకు సూచించామన్నారు*.
కంపార్ట్మెంట్లను *నిరంతరం పర్యవేక్షించి* *ఎక్కడా* *జాప్యం* *లేకుండా భక్తులను దర్శనానికి* *వదులుతున్నామన్నారు*.
అవసరమైన ప్రాంతాల్లో ఫ్యాన్లు మారుస్తామని, ఆన్ని ప్రాంతాల భక్తులకు అర్థమయ్యేలా 5 భాషల్లో డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని *సూచించామని తెలిపారు*. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం స్థానికాలయాల సమాచారాన్ని ప్రదర్శించాలని సూచించామన్నారు. మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించామన్నారు.
శ్రీవారి ఆలయంలో వెండి వాకిలి వద్ద భక్తులు ప్రవేశించేటపుడు, తిరిగి వెలుపలికి వచ్చేటపుడు *తోపులాట జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడి భద్రతా సిబ్బందికి సూచించామన్నారు*.
*ఎలక్ట్రికల్ వైర్లు బయటకు కనిపించకుండా తగిన చర్యలు చేపడతామన్నారు*.
*ధర్మప్రచారంలో భాగంగా ఎస్విబిసిలో పండుగలు-పూజావిధానంపై డాక్యుమెంటరీలు రూపొందించి ప్రసారం చేస్తున్నట్టు తెలిపారు*.
*టిటిడి ఉత్సవాలు, పర్వదినాల సమాచారాన్ని వెబ్ సైట్లో పొందుపరచడం ద్వారా లక్షలాది మంది భక్తులు తెలుసుకునే అవకాశం ఉందన్నారు*.
*అన్నప్రసాద భవనంలో* *భక్తులకు ఎలా వడ్డించాలి*, *ఎలా వ్యవహరించాలి అనే విషయాలపై* *డాక్యుమెంటరీ రూపొందించి* *ప్రదర్శిస్తామని*,
*తద్వారా శ్రీవారి* *సేవకులకు*,
*సిబ్బందికి అవగాహన పెంచుతామని తెలియజేశారు*.
ఆదేవిధంగా కల్యాణకట్టల్లో క్షురకులు భక్తులతో ఎలా వ్యవహరించాలి, కంపార్ట్‌మెంట్లు వదిలే సమయంలో భక్తులు *తోపులాటకు గురికాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై డాక్యుమెంటరీలు రూపొందించి ప్రదర్శిస్తామన్నారు*.
జెఈవో వెంట టిటిడి శ్రీవారి ఆలయ డెప్యూటి ఈఓ శ్రీ హరీంద్రనాథ్, విఎస్‌వో శ్రీ మనోహర్, ఆరోగ్యశాఖాధికారి డా.. శర్మిష్ట, రిసెప్షన్ డెప్యూటి ఈఓ శ్రీ బాలాజి, కల్యాణకట్ట డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న ఇతర అధికారులు ఉన్నారు