JEO-Tirumala-Tirupati-Devasthanams-(TTD)-Tirupati
http://tirumala.org
Sri B.Lakshmikantham, IAS
TTD-Tirupati-Joint Executive Officer

శనివారం, ఫిబ్రవరి 16, 2019
భక్తులే తొలి ప్రాధాన్యం
ఆధ్యాత్మికం, పర్యాటకం మేళవింపు
త్వరలోనే ‘డయల్ తితిదే జేఈవో’
స్థానిక ఆలయాల భద్రతపై సమీక్ష
‘ఈనాడు- ఈటీవీ’తో తితిదే తిరుపతి జేఈవో లక్ష్మీకాంతం
ఈనాడు, తిరుపతి
రాష్ట్ర రాజధాని అమరావతిలో భాగమైన కృష్ణా జిల్లా కలెక్టరుగా పనిచేసిన బి.లక్ష్మికాంతం బదిలీల్లో భాగంగా ఇటీవలే తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు తీసుకున్నారు. గతంలో తితిదేలో స్పెషల్ గ్రేడ్ అధికారిగా పనిచేసిన అనుభవం ఉన్న లక్ష్మీకాంతం తిరుపతి జేఈవోగా ఓ బృహత్తర ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ‘‘భక్తుడే ప్రథమం’’ అన్న నినాదంతో… సులభంగా, వేగంగా అన్న సిద్ధాంతంతో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. ఆయన శుక్రవారం ‘ఈనాడు-ఈటీవీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే….
సాంకేతికతను ఇంకా వినియోగించుకోవాలి…
ప్రభుత్వం సాంకేతిక వేగానికి ప్రాధాన్యమిస్తోంది. దీనికి తగినట్లుగా అన్ని విభాగాలు మారాలి. తితిదే ఆధ్వర్యంలోని ఆలయాల్లో ఐవీఆర్‌ఎస్ ద్వారా భక్తుల అభిప్రాయాలను సేకరిస్తాం. వారి సూచనలకు తగు ప్రాధాన్యమిచ్చి.. లోపాలుంటే సవరించుకుంటాం. ఇకపై ప్రతి వారం డయల్ తితిదే జేఈవో కార్యక్రమాన్ని నిర్వహించి.. స్థానికంగా ఉన్న ఆలయాలు, పరిస్థితులను భక్తుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను.
పనులు రెండు రకాలు
నేను పనుల్ని రెండు రకాలుగా విభజించి చేస్తాను. అప్పటికప్పుడు చేయాల్సినవి. దీర్ఘకాలిక ప్రణాళికతో చేయాల్సినవి. తితిదే ఆధ్వర్యంలోని ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు, ఉత్సవాలు, పండుగలకు సంబంధించిన పనులు దీర్ఘకాలిక వ్యూహంతో చేపట్టాల్సినవి. ఇవి శాశ్వత ప్రాతిపదికన చేయాల్సి ఉంది. వాటి పురోగతికి కొంత గడువు విధించుకొని.. ప్రణాళికబద్ధంగా చేపడతాం. ప్రాధాన్యమున్న పనులే తొలుత మొదలుపెట్టి పూర్తి చేస్తాం.
పర్యటకాన్ని జత చేస్తాం… తిరుపతి, తిరుమలకు వచ్చే భక్తుల్లో ఎక్కువ శాతం కేవలం శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకొని తిరిగి వెళ్లిపోతున్నారు. తిరుపతిలో ఎంతో విశిష్ఠత గల ఆలయాల గురించి వారికి సమాచారం తెలియడం లేదు. అలాగే విజయవాడ భవానీ ద్వీపంలో పెట్టినట్లు లేజర్ షోను పెట్టాలనే ఆలోచన ఉంది. కొండపల్లి ఖిల్లాలో మాదిరిగా బొమ్మలతోనే ఆ ప్రాంత విశిష్ఠతను చెప్పించే సాంకేతికతను తీసుకొస్తాం. మొత్తం ఆలయాలను, పర్యాటక ప్రాంతాలను కలుపుతూ పర్యాటక సర్య్కూట్‌ను అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉంది. దీనిపై పర్యాటక శాఖ అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. ఏ ప్రాంతాలు ఎంత మేర అభివృద్ధి చేయాలి? అక్కడున్న వనరుల్ని ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై కసరత్తు చేస్తాం. పర్యటక శాఖతో జత కట్టి… ముందుకు వెళ్తాం. దీనిపై త్వరలోనే సమావేశం నిర్వహిస్తాను.
ప్రతి నగరంలో శ్రీవారి ఆలయం….
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో నిర్మించిన శ్రీవారి ఆలయం ఈ నెలలో ప్రారంభిస్తాం. రాజధాని అమరావతిలోని శ్రీవారి ఆలయం లోపలి ప్రాకారాలకు సంబంధించిన పనులు ఓ కొలిక్కి వచ్చాయి. బయట ఉన్న స్థలం, అక్కడున్న వనరులు ఉపయోగించుకొని ఎలాంటి అభివృద్ధి చేయాలో ఓ డిజైన్ చేసి అమరావతి ఆలయాన్ని అత్యంత సుందరంగా నిర్మిస్తాం. భువనేశ్వర్, ముంబాయిలోనూ శ్రీవారి ఆలయాలను నిర్మించే ఆలోచన చేస్తున్నాం. క్రమక్రమంగా స్వామివారి వైభవాన్ని విశ్వవ్యాపితం చేస్తాం. కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామ ఆలయాన్ని రూ.100 కోట్ల నిధులతో బృహత్తరంగా అభివృద్ధి చేస్తాం.
విద్య, వైద్యంపై దృష్టి…
తితిదే పరిధిలో కేవలం ఆలయాలే కాదు. సంక్షేమం కూడా ఉంది. మనిషికి కావాల్సిన విద్య, వైద్యం విభాగాలను పటిష్ఠపరుస్తాం. దీనిపై నిరంతర సమీక్షలు అవసరం. ఇక నుంచి తితిదే పరిధిలోని విద్యాలయాలు, వైద్యాలయాల స్థితిగతులను పరిశీలిస్తాను. ఉన్న వాటిని మరింత అద్భుతంగా ఎలా మార్చాలో.. కసరత్తు చేస్తాను. అలాగే మిగిలిన ట్రస్టులను బలోపేతం చేసే దిశగానే చర్యలుంటాయి.
భద్రతపై త్వరలో సమీక్ష…
గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాలు మాయమైన కేసుపై ఎప్పటికప్పుడు మా అనుశీలన సాగుతోంది. మా వరకు పోలీసులకు పూర్తిగా సహకరిస్తాం. ఆలయాల్లో భద్రతపై భక్తుల్లో అనుమానాలు ఉన్నాయి. దీనికోసం త్వరలోనే సమావేశం నిర్వహించి.. భద్రతను ఎలా పటిష్ఠం చేయాలి? సాంకేతికతను ఎలా వినియోగించవచ్చు? మానవ వనరుల నియామకం అవసరమా? తదితర విషయాలను జపరిశీలిస్తాం. ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో తెలుసుకుంటాం. ఇంటిలిజెన్స్ సర్వైలెన్స్ వ్యవస్థ ద్వారా మరోసారి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం.
చెరువులను మహర్దశ…
తిరుపతిని లేక్ సిటీగా పిలుస్తారు. ఇప్పటికే అవిలాల చెరువు అభివృద్ధి సాగుతోంది. గతంలో తితిదేకు ఇచ్చిన చెరువులను క్రమపద్ధతిలో సుందరీకరిస్తాం. అక్కడ ఎలాంటి పనులు చేస్తే స్థానికులు ఆటవిడుపు కోసం వస్తారో గమనించి.. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు చెరువుల సుందరీకరణ చేస్తాం.
రెండోసారి అవకాశం రావడం అదృష్టం..
స్వామి చెంతనే పనిచేసే అవకాశం రావడమే అదృష్టం. అది నాకు రెండోసారి లభించింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటాను. నాకున్న పరిధి మేరకు తితిదే అభివృద్ధి కోసం బృహత్తర ప్రణాళికతో ముందుకు వెళతాను. దీనికి అన్నీ శాఖల సహకారం తీసుకుంటాం.
‘‘ప్రతి పురుషుడి విజయంలో స్త్రీ పాత్ర ఉంటుంది. కలియుగనాథుడైన శ్రీవేంకటేశ్వరుడి హృదయనివాసి పద్మావతి అమ్మవారు. తిరుమలకు వచ్చే యాత్రికుల్లో ఎంతోమంది అమ్మవారిని దర్శించుకోకుండానే వెళ్లిపోతున్నారు. వారికి స్థలపురాణం తెలియదు. పద్మావతి దేవి ప్రాశస్త్యం, తిరుచానూరు వైభవాన్ని మరింత చాటాల్సిన అవసరం ఉంది.’’
సోమవారం, ఫిబ్రవరి 11, 2019
సామాన్య భక్తులకే ప్రాధాన్యం : తితిదే తిరుపతి జేఈవోగా లక్ష్మీకాంతం బాధ్యతల స్వీకరణ
తిరుమల, న్యూస్‌టుడే: భగవంతుని దర్శనం కల్పించడంలో సంతృప్తికర ఏర్పాట్లు చేయడం ద్వారా భక్తుల ముఖంలో చిరునవ్వు చూడడమే తమ లక్ష్యమని తితిదే తిరుపతి జేఈవో బి.లక్ష్మీకాంతం అన్నారు. శ్రీవారి ఆలయంలో ఆదివారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ తితిదేని ప్రపంచంలోనే ఉన్నతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. సామాన్య భక్తులకే మొదటి ప్రాధాన్యత ఇస్తూ.. సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తామని తెలిపారు. భక్తులకు వేగంగా, సులభంగా దర్శనం కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్వామివారి ఆస్తులను పరిరక్షించేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. అంతకు ముందు మందిరంలోని రంగనాయకుల మండపంలో నూతన జేఈవో దంపతులను శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, వసతి కల్పన విభాగం డిప్యూటీ ఈవో బాలాజీ, పార్‌పత్తేదారు శశిధర్ సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి, చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం తిరుపతిలోని కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు.
తితిదే తిరుపతి జేఈవో లక్ష్మీకాంతం దంపతులకు శ్రీవారి చిత్రపటాన్ని బహూకరిస్తున్న డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ తదితరులు
Sri B.Lakshmikantham, IAS
J.E.O. : Joint Executive Officer, TTD, Tirupati
10-ఫిబ్రవరి-2019
నేడు తిరుపతి జేఈవో బాధ్యతల స్వీకరణ
తితిదేపై పట్టుకలిగిన అధికారిగా లక్ష్మీకాంతం గుర్తింపు
సీఎం నిర్ణయంతో నియామకం
Tirumala Tirupati Devasthanams
TTD Administrative Building
K.T. Road, Tirupati – 517 501
Andhra Pradesh, India
10-ఫిబ్రవరి-2019
లక్ష్మీకాంతానికి స్వాగతం పలుకుతున్న డిప్యూటీ ఈవో బాలాజీ
తిరుమల, న్యూస్‌టుడే: తితిదే తిరుపతి జేఈవోగా బి.లక్ష్మీకాంతం ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. కృష్ణా జిల్లా కలెక్టరుగా పని చేసిన ఐఏఎస్ అధికారి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతిభను గుర్తించిన ముఖ్యమంత్రి తితిదే జేఈవోగా నియమించారు. ఈయన ఏడేళ్ల కింద తితిదే ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవోగా వసతి కల్పన విభాగంలో పని చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి భక్తులకు సులభంగా గదులు లభించేలా సంస్కరణలు తీసుకువచ్చారు. గదులు ఆధునికీకరణ, భక్తులకు ప్రత్యేక వసతులు కల్పనలాంటి చర్యలు తీసుకున్నారు. దేవస్థానంపై పట్టున్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తిరుపతి జేఈవోగా కీలక బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంది. అలిపిరిలో భారీ వసతి సముదాయం నిర్మాణం, అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణం, హైదరాబాదులో నిర్మించిన మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ, దేవస్థానం పరిపాలనలో సమూల మార్పులు తీసుకురావడానికి విశేష కృషి చేయాల్సి ఉంది. దేవస్థానంలో తిరుపతి జేఈవోకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. పరిపాలనలో ప్రత్యేక గుర్తింపు ఉన్న వ్యక్తిగా పేరొందిన లక్ష్మీకాంతం ఆదివారం ఉదయం 8.30 గంటలకు శ్రీవారి ఆలయంలో బాధ్యతలు సీˆ్వకరించనున్నారు. తిరుమలకు శనివారం రాత్రి చేరుకున్న ఆయనకు తితిదే వసతి కల్పన విభాగం డిప్యూటీ ఈవో బాలాజీ స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు.
TTD-Tirupati-JEO
తితిదే తిరుపతి జేఈవోగా లక్ష్మీకాంతం
తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఒకే దగ్గర మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పనిచేస్తున్న వారిని బదిలీలు చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. దీనిలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (జేఈవో)గా పనిచేస్తున్న పోల భాస్కర్ సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. 2005 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన 2013లో తితిదే జేఈవోగా బాధ్యతలు స్వీకరించారు. సుమారు 6 సంవత్సరాలకు పైగా తితిదే జేఈవోగా కొనసాగారు. బదిలీల్లో భాగంగా కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, ఐఏఎస్(2006)ను తితిదే తిరుపతి జేఈవోగా నియమించారు.