Sri Kodandarama-Swamy-Temple – Vontimitta
శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం
ఒంటిమిట్ట – కడప జిల్లా
శ్రీరామనవమి బ్రహ్మోత్సవములు బ్రహ్మోత్సవములు
12-04-2019 నుండి 22-04-2019 వరకు

శుక్రవారం, ఏప్రిల్ 19, 2019

జానకిరాముల కల్యాణం.. కాంచిన కనులదే భాగ్యం
ఘనంగా ఒంటిమిట్ట కోదండపాణి కల్యాణోత్సవం
మహోత్సవానికి హాజరైన గవర్నరు దంపతులు
పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
సకలగుణధాముడు శ్రీరాముడు పెళ్లికుమారుడయ్యాడు. సద్గుణ సంపన్నరాశి సీతామహాలక్ష్మి పెళ్లికుమార్తె అయింది. ముక్కోటి దేవతలు తరలిరాగా అష్టదిక్పాలకులు ఆసీనులై ఉండగా గురువారం జానకీరాముల పరిణయం కనుల పండువగా సాగింది.. ఒంటిమిట్ట శ్రీరామ నామస్మరణతో మార్మోగింది.
కడప, ఈనాడు: కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీరామనామస్మరణతో మార్మోగింది. జానకిరాముల పరిణయం కనుల పండువగా సాగింది. ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో ఆలయంలో పూజలు ప్రారంభం కాగా 10 గంటలకు రాములవారికి శివధనుర్భంగాలంకారం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించి భక్తులకు సర్వదర్శన భాగ్యం కల్పించారు.
వైభవంగా శోభాయాత్ర
సాయంత్రం ఆరు గంటలకు ఆలయం నుంచి కల్యాణ వేదిక వరకూ శోభాయాత్ర జరిగింది. కోలాటాలు, చెక్కభజనలతో, సంప్రదాయ నృత్యాల నడుమ కోదండరామాలయం నుంచి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చేపట్టిన ఎదుర్కోలు ఉత్సవం ఆకర్షణీయంగా సాగింది. తదుపరి స్వామి, అమ్మవార్లను కల్యాణ వేదికపైకి చేర్చి రుత్వికులు వివాహ క్రతువును ఆరంభించారు. రాత్రి 8-10 గంటల మధ్య జానకి రాముల కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీసమేతంగా విచ్చేశారు. కడపకు విమానంలో వచ్చిన గవర్నరుకు అధికారులు స్వాగతం పలికారు. స్థానిక అతిథిగృహంలో కాసేపు బస చేసిన అనంతరం ఒంటిమిట్టకు వచ్చి కోదండరాముని దర్శించుకుని కల్యాణంలో పాల్గొన్నారు. సాయంత్రం ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం అక్కడి నుంచి కడప ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి వచ్చారు. అక్కడ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. సాయంత్రం ఏడు గంటల సమయంలో కడప నుంచి ముఖ్యమంత్రి ఒంటిమిట్టకు బయల్దేరి.. నేరుగా రామయ్య ఆలయానికి చేరుకున్నారు. అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సీఎం ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను ఊరేగింపుగా కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు. స్వామి, అమ్మవార్లకు వాటిని అలంకరింపచేసిన అర్చకులు అనంతరం కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరిపారు.
ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి గురువారం రాములవారిని దర్శించుకుని కల్యాణంలో పాల్గొన్నారు. భారీ ఎత్తున భక్తులు హాజరయ్యారు. అందమైన పుష్పాలంకరణలు, విద్యుద్దీప కాంతుల మధ్య ఒంటిమిట్ట కాంతులీనింది. భక్తుల భగవన్నామ స్మరణతో కల్యాణ ప్రాంగణం ప్రతిధ్వనించింది. ఎక్కువసేపు గవర్నర్, సీఎం ముచ్చటించుకుంటూ కల్యాణం తిలకించారు. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి తితిదే, జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాయి. ప్రధానంగా చంద్రుడు ఒంటిమిట్ట రాముడి కల్యాణాన్ని తిలకించేలా వేదిక ముందు భాగాన్ని ఎలాంటి పైకప్పు లేకుండా నిర్మించారు. వేదికకు కుడి, ఎడమవైపున జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో షెడ్లు నెలకొల్పారు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను భక్తులకు అందించారు. తాగునీరు, మజ్జిగ, ఆహారం అందుబాటులో ఉంచారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.
నేడు రథోత్సవం
వివాహ అనంతరం రాత్రి పది గంటల నుంచి 12 గంటల వరకూ గజవాహన సేవ వైభవంగా జరిగింది. అనంతరం అర్చకులు స్వామి, అమ్మవార్లకు ఏకాంత సేవ నిర్వహించారు. శుక్రవారం ఉదయం 6.40 గంటలకు రథారోహణం జరపనున్న రుత్వికులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ రథోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
వెంటాడిన వర్షభయం
కల్యాణానికి గురువారం వర్షభయం వెంటాడింది. గతేడాది అకాల వర్ష బీభత్సంతో గందరగోళ పరిస్థితులు తలెత్తగా నలుగురు భక్తులు మృత్యువాత పడటం.. పలువురు గాయపడటం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నా వాతావరణంలో మార్పులు ఒకింత ఆందోళనకు గురిచేశాయి. గురువారం సాయంత్రం స్వల్ప ఈదురుగాలుల ధాటికి కల్యాణ ప్రాంగణం చుట్టూ దుమ్ము రేగడంతో కొంతసేపు ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం ఐదు గంటల సమయానికి వాతావరణంలో సాధారణ పరిస్థితులు నెలకొనడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తితిదే కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్‌సింఘాల్, జేఈవో లక్ష్మీకాంతం, కలెక్టరు హరికిరణ్, ఎస్పీ అభిషేక్ మొహంతి పరిస్థితిని సమీక్షించారు. ఏర్పాట్లపై భక్తులను ఆరా తీశారు. కల్యాణ ప్రక్రియ పూర్తి చేసుకుని రాత్రికి కడపకు చేరుకున్న చంద్రబాబు అక్కడే బస చేశారు. శుక్రవారం ఉదయం కర్నూలు జిల్లా ఓర్వకల్లు బయల్దేరి వెళతారు.
కడప:
ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ
నేటి నుండి ఈ నెల 22 వ తేది వరకు అత్యంత వైభవంగా నవమి వేడుకలు నిర్వహణకు టిటిడి శ్రీకారం
12 వ తేది అంకురార్పణ
13వ తేది ద్వజారోహణము
14వ తేది శ్రీరామనవమి వేడుకలు హంస వాహనంపై స్వామివారి సేవ
15వ తేది సింహ వాహనంపై స్వామివారి సేవ
16వ తేది హనుమంతసేవ
17వ తేది గరుడసేవ
18వ తేది సీతారాముల కళ్యాణోత్సవము
19వ తేది రథోత్సవం
20వ తేది అశ్వ వాహన సేవ
21వ తేది చక్రస్నానం
22 వ తేది పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగింపు
ఉత్సవాల నిర్వహణకు ముందస్తు చర్యలు చేపట్టిన టిటిడి అధికారులు
18 న జరుగు కళ్యాణోత్సవానికి 3 లక్షల మంది భక్తులు వీక్షించుటకు భారీ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
Visited on 14-February-2019
https://en.wikipedia.org/wiki/Kodandarama_Temple,_Vontimitta
సీతారాముల కళ్యాణం చూతము రారండీ
అభివృద్ధి పనులు మరింత వేగవంతం
ప్రగతిపై ప్రతివారం సమీక్ష చేస్తా
జనరంజకంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం
తితిదే జేఈవో లక్ష్మీకాంతం వెల్లడి
రామాలయంలో అధికారులతో మాట్లాడుతున్న జేఈవో లక్ష్మీకాంతం
ఒంటిమిట్ట, న్యూస్‌టుడే : ఏకశిలానగరి కోదండ రామాలయం చెంతన జరుగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తాం. పనుల్లో ప్రగతిపై ప్రతివారం సమీక్ష నిర్వహిస్తాం. రామాలయం చరిత్రపై విస్తృత ప్రచారం చేస్తామని.. తిరుమల తిరుపతి దేవస్థానాల సంయుక్త కార్యనిర్వహణాధికారి బి.లక్ష్మీకాంతం పేర్కొన్నారు. రామయ్య సన్నిధిలో జరుగుతున్న వివిధ పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఆలయ ఆవరణలో కడప నాపరాయి మార్పు, శ్రీవారిపోటు నవీకరణ, ఉద్యాన వనాల శోభ, పరిపాలన కార్యాలయం, భక్తుల విడిది భవనం, సీతారాముల కల్యాణ వేదిక, వాహనాలు నిలుపు స్థలం, భూసేకరణ, పరిహారం చెల్లింపు, పాఠశాల భవనాల నిర్మాణం, విద్యుత్తుదీపాల ఏర్పాటుపై ఆయా శాఖల అధికారులతో చర్చించారు. అనంతరం జేఈవో లక్ష్మీకాంతం విలేకర్లతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఒంటిమిట్టలో రూ.100 కోట్లతో అభివృద్ధి చేయాలని తితిదే ముందుకొచ్చింది. ఇప్పటికే కొన్ని పనులు పూర్తవ్వగా, మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. ఇంకొన్ని పూర్తయ్యే దశకు వచ్చాయి. ఇంకా పలు రకాల పనులు చేయాల్సి ఉందన్నారు. త్వరలో అనుమతి ఇస్తామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 12- 22 వరకు బ్రహ్మోత్సవాలను జనరంజకంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే దృష్టి సారించాం. భక్తులకు కావాల్సిన వసతులు కల్పిస్తాం. సీతారాముల కల్యాణ వేదికను అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతాం. ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నాం. పచ్చదనం పెంపు, వాహనాల పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిపారు. తాగునీరు, పారిశుద్ధ్యం, తాత్కాలిక పందిళ్ల ఏర్పాటు, కరెంటు సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఒంటిమిట్ట ఆలయ చారిత్రక ఘనతపై విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు. ఉత్సవాలపై ప్రాచుర్యం కల్పిస్తామన్నారు. స్థానిక చెరువు కట్టను బలోపేతం చేసేందుకు జలవనరుల శాఖ సాంకేతిక నిపుణులతో చర్చించినట్లు వెల్లడించారు. నీటిలో బోటు షికారు వసతి కల్పించేందుకు పర్యటకశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు వివరించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ రమేష్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, డీఎఫ్‌వో ఫణికుమార్‌నాయుడు, ఎస్టేట్ అధికారి విజయసారథి, ప్రత్యేకాధికారిణి గౌతమి, ఈఈ జగనోమోహన్‌రెడ్డి, డీఈలు హర్షవర్దన్‌రెడ్డి, లక్ష్మీదేవి, డిప్యూటీ ఈవో నటేష్‌బాబు, ఏఈవో రామరాజు, విజిలెన్సు అధికారి అశోక్‌కుమార్ గౌడ్, తహసీల్దారు శిరీష, ఏఈలు దేవరాజు పాల్గొన్నారు.
Kodandarama Temple is a Hindu temple dedicated to the god Rama, located in Vontimitta town in Rajampet taluk of Kadapa District in the Indian state of Andhra Pradesh. The temple, an example of Vijayanagara architectural style, is dated to the 16th century. It is stated to be the largest temple in the region. It is located at a distance of 25 kilometres (16 mi) from Kadapa and is close to Rajampet. The temple and its adjoining buildings are one of the centrally protected monuments of national importance.